ఆర్థిక వ్యవస్థ కోసం చిదంబరం సూచనలు

by Shamantha N |
ఆర్థిక వ్యవస్థ కోసం చిదంబరం సూచనలు
X

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టడానికి కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం కేంద్రానికి పలు సూచనలు చేశారు. డిమాండ్ పెంచడం, ఉత్పత్తి పెంచి ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవనం చేయడానికి పేదరికంలోని 50 శాతం కుటుబాలకు నేరుగా నగదు బదిలీ చేయాలని సూచించారు. దానితోపాటు వేతనాలు చెల్లించడానికి ఆహార ధాన్యాలను వినియోగించాలని, ప్రభుత్వ పనుల్లో పెట్టుబడులు పెంచాలని, రుణాల వితరణ కోసం బ్యాంకుల్లో మూలధనాన్ని సమకూర్చాలని తెలిపారు.

వీటన్నింటికీ డబ్బు అవసరమని, సంశయించకుండా అప్పు చేయండని సూచించారు. అంతేకాదు, సొమ్ము సమకూర్చుకోవడానికి మరిన్ని సూచనలు చేస్తూ ఇంకో ట్వీట్ చేశారు. ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనను సడలించి ఈ ఏడాది రుణాలు ఎక్కువ తీసుకోవడం, పెట్టుబడులను ఉపసంహరించుకోవడం (డిజిన్వెస్ట్‌మెంట్), ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్, ఏడీబీల నుంచి రుణాల ఆఫర్‌లు వినియోగించుకోవడం లాంటి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.

Advertisement
Next Story

Most Viewed