- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చికెన్ పకోడీ చేసుకొండిలా
కావాల్సిన పదార్థాలు:
బోన్‌లెస్ చికెన్ -అర కేజీ
సెనగపిండి -2 టేబుల్ స్పూన్
అల్లం -చిన్న ముక్క
వెల్లుల్లి -ఆరు రెబ్బలు
కారం -2 టేబుల్ స్పూన్
గరం మసాలా -1 టీ స్పూన్
ధనియాల పొడి -1టీ స్పూన్
పెరుగు -1 టేబుల్ స్పూన్
నిమ్మరసం -1 టేబుల్ స్పూన్
కొత్తిమీర, పుదీన తరుగు -కట్ట చొప్పున
ఉప్పు -రుచికి తగినంత
నూనె- వేయించడానికి సరిపడా
తయారీ విధానం:
ముందుగా కొత్తిమీర, పుదీన, అల్లం వెల్లుల్లిని తీసుకుని మిక్సీలో వేసి ముద్దగా చేసుకోవాలి. ఇప్పుడు చికెన్‌ను ఒక గిన్నెలోని తీసుకొని అందులో ధనియాల పొడి, గరం మసాలా, కారం, పెరుగు, నిమ్మరసం, కొత్తిమీర ముద్దను వేసుకుని కలియతిప్పాలి. మసాలా పట్టించిన ముక్కలను కనీసం నాలుగు గంటలు నానబెట్టాలి.
తర్వాత చికెన్ మిశ్రమంలో ఒక స్పూన్ నూనె, సెనగపిండి వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు బాణీలో నూనె వేడి వేసి అందులో సెనగపిండి కలిపిన చికెన్‌ను పకోడీలా వేసుకోవాలి. గోల్డెన్ కలర్‌లోకి వచ్చేదాకా మీడియం ఫ్లేం మీద వేగించుకుని ఒక ప్లేట్‌లో ఉల్లిపాయలు, నిమ్మకాయ ముక్కలతో సర్వ్ చేసుకుంటే టెస్టీ చికెన్ పకోడీ రెడీ..