- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చికెన్ వ్యాపారి దేశభక్తికి లోకల్స్ ఫిదా..
దిశ, కరీంనగర్ సిటీ : వ్యాపారస్తులు ఎవరైనా నాలుగు రూపాయలు వెనకేసుకోవాలనే ఆలోచనతో ఉంటారు. కానీ, కరీంనగర్‌లో ఓ చికెన్ వ్యాపారి వ్యాపారి తన లాభాన్ని పక్కన బెట్టి దేశభక్తిని ప్రదర్శిస్తుండటం అందరినీ ఆకర్షిస్తోంది. నగరంలోని జ్యోతినగర్‌లో సూర్య మిత్ర రెసిడెన్సీకి ఎదురుగా మాలతి చికెన్ సెంటర్‌ను చిలుక రమేశ్ ఏర్పాటు చేశాడు. నెల రోజులుగా కోళ్లు, కోడిగుడ్లు, చికెన్ అమ్ముతున్నాడు.
కిలో చికెన్‌కు 2కోడిగుడ్లు ఫ్రీగా ఇవ్వడం, ఆర్డర్‌పై ఫ్రీ గానే హోం డెలివరీ చేయడంతో పాటు సైనికులకు, మాజీ సైనికులకు 50శాతం తగ్గింపు ధరతో అమ్ముతున్నాడు. మొదటి రెండు ఆఫర్లు కస్టమర్లను ఆకట్టుకునేందుకేనని స్పష్టమవుతున్నా.. సైనికులకు సగం ధరకే విక్రయించడం అతడి దేశభక్తిని చాటుతోందని కొనుగోలుదారులు పేర్కొంటున్నారు. ప్రజలు కంటినిండా నిద్ర పోతున్నారంటే.. సైనికులు నిద్ర లేని రాత్రులను గడపడం వల్లనేనని చికెన్ వ్యాపారి చెప్తున్నాడు. అందుకోసమే సైనికులకు తనవంతు సాయం చేస్తున్నానని వ్యాపారి చెబుతున్నాడు.