చెన్నకేశవులు తండ్రి మృతి 

by Sumithra |   ( Updated:2020-03-09 06:12:20.0  )
చెన్నకేశవులు తండ్రి మృతి 
X

దిశ, మహబూబ్ నగర్: దిశ ఘటనలో నిందితుడు అయిన చెన్నకేశవులు తండ్రి కురమయ్య మృతిచెందారు. రెండు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడిన అతను కోమాలోకి వెళ్లారు. అప్పటి నుంచి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. సోమవారం మధ్యాహ్నం కురమయ్య మృతి చెందాడు. దిశ ఘటనలో మొదటి నుంచీ అందరి కంటే ఎక్కువగా చెన్నకేశవులు పేరే వినిపించింది. రెండు రోజుల క్రితమే అతని భార్య ఆడపిల్లకు జన్మనిచ్చింది. దీంతో సంతోషకరమైన వాతావరణం నెలకొంటున్న సమయంలో వారి కుటుంబంలోనే మరో వ్యక్తి మరణించడంతో బాధితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Tags: disha case, accused’s, father, died

Advertisement

Next Story