- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ధోని వర్సెస్ కోహ్లీ.. విజయం ఎవరికి దాసోహం..?
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 19వ మ్యాచ్ (RCB vs CSK) ఈ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు వేయి కండ్లతో ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ‘ఈ సాలా కప్ నమ్‌దే’ కలను సాకారం చేసేందుకు ఆర్సీబీ వరుస విజయాలతో ప్రత్యర్థులకు వణుకు పుట్టిస్తుంది. మరోవైపు గతేడాది దెబ్బతిన్న సీఎస్కే.. ఈ సారి మాత్రం పంజా విసురుతోంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆడిన నాలుగు మ్యాచుల్లో వరుసగా విజయం సాధించి 8 పాయింట్లతో టాప్ ప్లేస్‌లో ఉంది. అటు ధోని సేన కూడా ఏ మాత్రం తగ్గకుండా 3 విజయాలు ఒక పరాజయంతో 6 పాయింట్లు సాధించి రెండో స్థానంలో కొనసాగుతుంది. దీనికితోడు ఒకరు టీమిండియా మాజీ కెప్టెన్ ధోని అయితే.. కోహ్లీ ప్రస్తుతం కెప్టెన్‌గా కొనసాగుతుండటం విశేషం.
జట్ల బలాబలాలు..
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: ఆర్సీబీ ఆడిన నాలుగు మ్యాచుల్లో.. తొలి మూడు మ్యాచుల్లో టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మాన్‌లు విఫలమయ్యారు. జట్టు భారాన్ని మిడిలార్డర్ బ్యాట్స్‌మాన్లు అయిన ఏబీ డివిలియర్స్, గ్లేన్ మ్యాక్స్‌వెల్ మోసుకొచ్చారు. వీరికి తోడు బౌలర్లు కూడా తమ వంతు కృషి చేశారు. కానీ, నాలుగవ మ్యాచ్‌లో మాత్రం ఆర్సీబీ ఓపెనర్లు చెలరేగిపోయారు. దేవదత్ పడిక్కల్, కోహ్లీ బ్యాక్ టు ఫామ్ అంటూ వికెట్ కోల్పోకుండా విజయాన్ని తీసుకొచ్చారు. దీంతో మిడిలార్డర్‌కు టాప్ ఆర్డర్‌కూడా తోడు కావడంతో ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ మరింత పటిష్టంగా తయారైంది. ఇక బౌలింగ్‌లో మహ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్, కైల్ జేమిసన్ రాణిస్తున్నారు. స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ తన ప్రతిభకు తగ్గట్టు ఆడాల్సి ఉంది. ఓరాల్‌గా చూస్తే ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ఆర్సీబీ బలంగా కనిపిస్తుంది.
చెన్నై సూపర్ కింగ్స్: గతేడాది పేలవ ప్రదర్శనతో లీగ్ దశలోనే ఇంటి బాట పట్టిన సీఎస్కే జట్టులో పలు మార్పులు చేర్పులతో ఈసారి బరిలోకి దిగింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్.. ఫాఫ్ డు ప్లెసిస్, వన్‌డౌన్ బ్యాట్స్‌మాన్ మొయిన్ అలీ వారి సామర్థ్యాలకు తగ్గట్టు బ్యాటింగ్ చేస్తున్నారు. కానీ, సీఎస్కే మిడిలార్డర్ కాస్త బలహీనంగా ఉంది. ఇప్పటివరకు సురేశ్ రైనా, ధోని, జడేజా, అంబటి రాయుడు అంతగా ఆకట్టుకోలేదు. కానీ, లోయర్ ఆర్డర్ ఆల్‌రౌండర్ సామ్ కర్రన్ అద్భుత ప్రతిభ కనబర్చుతున్నాడు. ఇక బౌలింగ్ విషయానికొస్తే ఫేస్ బౌలర్ దీపక్ చాహర్ తొలి పవర్ ప్లేలోనే వికెట్లు తీసుకుంటూ ప్రత్యర్థి బ్యాట్స్‌మాన్లకు సవాల్‌గా మారాడు. మరో బౌలర్ లుంగి ఎంగిడి బాగానే రాణిస్తున్నాడు. షార్డూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా కూడా పర్వాలేదనిపిస్తున్నారు. ఈ రోజు జరిగే మ్యాచ్‌లో మిడిలార్డర్లు కూడా పుంజుకుంటే సీఎస్కేకు విజయం లాంఛనమవడం ఖాయం. కానీ, ఇరు జట్లలో బౌలింగ్, బ్యాటింగ్ లైనప్ స్ట్రాంగ్‌గా ఉండడంతో మ్యాచ్ విజయం ఎవరిని వరిస్తుందో అన్న ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది.