- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లవ్ జిహాద్‌పై ఛత్తీస్‌గఢ్ సీఎం హాట్ కామెంట్స్..
దిశ, వెబ్‌డెస్క్ : బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కువగా వినిపిస్తున్న లవ్ జిహాద్ అనే అంశంపై ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ భగేల్ సంచలన కామెంట్స్ చేశారు. లవ్ జిహాద్‌పై కొత్త చట్టం తీసుకురావాల్సిన అవసరం ఎంటనీ ఆయన మండిపడ్డారు. బీజేపీ నేతల కుటుంబాల్లో జరిగిన మతాంతర వివాహాలనూ లవ్ జిహాద్‌గానే పరిగణించాలా అని ప్రశ్నించారు. వారు కూడా బలవంతపు మత మార్పిళ్లకు పాల్పడ్డారా? అని అడిగారు.
అనేక మంది బీజేపీ నేతల కుటుంబాల్లో మతాంతర వివాహాలు జరిగాయని ఈ సందర్భంగా గుర్తుచేశారు. హిందూ యువతులను వివాహం పేరుతో బలవంతంగా మతమార్పిళ్లకు పాల్పడటానికి ముస్లిం యువకులు ప్రయత్నిస్తున్నారని.. ఆ కుట్రలనే లవ్ జిహాద్ అని బీజేపీ సపోర్టర్స్ వ్యవహరిస్తున్నారు. లవ్ జిహాద్‌తో భారత్‌లోని హిందువులను మైనార్టీలోకి పడేయాలని కుట్ర చేస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ‘కుట్ర’లకు అడ్డుకట్ట వేసేందుకు బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హర్యానా, కర్ణాటక, అసోం ప్రభుత్వాలు కఠిన చట్టాలు తెస్తామని ఇప్పటికే ప్రకటించాయి.