- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దక్షిణాఫ్రికా ప్లేయర్ల కోసం చార్టెడ్ ఫ్లైట్
దిశ, స్పోర్ట్స్: కరోనా లాక్‌డౌన్ కారణంగా యూఏఈకి తరలిపోయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం అన్ని ఫ్రాంచైజీలూ సిద్ధమవుతున్నాయి. ఆటగాళ్లను యూఏఈ తరలించడానికి ఇప్పటికే కొన్ని ఫ్రాంచైజీలు చార్టెడ్ ఫ్లైట్లను బుక్ చేశాయి. అయితే, అన్ని ఫ్రాంచైజీలకు విదేశీ ఆటగాళ్లను యూఏఈ తీసుకెళ్లడం తలనొప్పిగా మారింది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో లాక్‌డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. అంతర్జాతీయ విమానాలు ఇంకా తిరగడం లేదు. ఈ పరిస్థితి మరో రెండు నెలలపాటు ఉంటుందని భావిస్తున్నారు. ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌లో ఆగస్టులో అంతర్జాతీయ విమానాలకు అనుమతి లభించే అవకాశం ఉంది. కానీ దక్షిణాఫ్రికా ఆటగాళ్లకే ప్రయాణ ఇబ్బందులు తలెత్తనున్నాయి. దీంతో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఉన్న ఫ్రాంచైజీలు కలిసి ఒక ఫ్లైట్ బుక్ చేయాలని నిర్ణయించాయి. దక్షిణాఫ్రికాకు చెందిన కసోగి రబాడా, క్వింటన్ డీకాక్, క్రిస్ మోరీస్, ఏబీ డివిలియర్స్ వంటి క్రీడాకారులు ఐపీఎల్‌లో ఆడుతున్నారు. వీళ్లు ఆయా ఫ్రాంచైజీలకు కీలకమైన ఆటగాళ్లు. దీంతో చార్టెడ్ ఫ్లైట్ పంపి వీరందరినీ దక్షిణాఫ్రికా నుంచి యూఏఈకి తీసుకొని రానున్నట్లు ఒక ఫ్రాంచైజీ అధికారి చెప్పారు. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం తర్వాత దీనిపై ఒక నిర్ణయం తీసుకోనున్నారు.