మిలీషియా సభ్యులకు చర్ల సీఐ వార్నింగ్.. ఎందుకో తెలుసా?

by Sridhar Babu |   ( Updated:2021-05-16 04:04:52.0  )
Charla SI Ashok
X

దిశ, భద్రాచలం: కూలి పనులు చేసుకొని జీవించే ఆదివాసీలను బెరింపులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని మావోయిస్టులకు చర్ల సీఐ అశోక్ వార్నింగ్ ఇచ్చారు. కొంతమంది మావోయిస్టు మిలీషియా సభ్యులు గ్రామాల్లో తిరుగుతూ తునికి ఆకు సేకరించే ప్రతీఒక్కరూ మనిషికి రూ.200 ఇవ్వాలని, అలాగే ప్రతీ ట్రాక్టర్ యజమాని రూ.20 వేలు ఇవ్వాలని బెదిరిస్తున్నట్టు వెల్లడించారు. చందాలు ఇవ్వకుంటే వచ్చే వ్యవసాయ సీజన్‌లో ట్రాక్టర్లు దుక్కి దున్నడానికి అనుమతించబోమంటూ బెదిరిస్తున్నట్లుగా తమ దృష్డికి వచ్చిందని సీఐ అశోక్ ఆరోపించారు.

మావోయిస్టుల అండ చూసుకొని ఇలా దౌర్జన్యాలకు పాల్పడుతూ, బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్న మిలీషియా సభ్యులకు, మావోయిస్టులకు హెచ్చరికలు జారీ చేశారు. ఆదివాసీల జోలికొస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ఆదివాసీలను బెదిరిస్తున్న వారి వివరాలు సేకరిస్తున్నామని అన్నారు. మళ్లీ ఇలాంటివి రిపీట్ అయితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రజలు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, పోలీసులు ప్రజల రక్షణ కోసం ఎప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed