- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఏపీఎస్ ఆర్టీసీ బస్సుసీట్లలో మార్పులు
దిశ, ఏపీ: కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి విధించిన లాక్‌డౌన్ ముగింపునకు చేరుకుంటోంది. కరోనాతో సహజీవనం చేయాల్సి ఉంటుందని చెబుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మానసికంగా సిద్ధం చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజా రవాణా త్వరలోనే ఆరంభం కానునట్టు తెలుస్తోంది. అయితే కరోనా నేపథ్యంలో భౌతికదూరం, మాస్క్‌లు ధరించడం తప్పనిసరైన నేపథ్యంలో, ప్రజా రవాణాలో మార్పులు చేసేందుకు ఏపీఎస్ ఆర్టీసీ మల్లగుల్లాలు పడుతోంది. సూపర్ లగ్జరీ బస్సుల్లో కరోనా కట్టడికి నాందిపలుకుతూ సమూల మార్పులతో ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు సరికొత్త ప్రయోగం చేయనున్నారు. ప్రయాణికులు భౌతికదూరం పాటించేలా బస్సు సీట్లలో మార్పులు చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఆర్టీసీ సూపర్ లగ్జరీ సిట్లలో 36 సీట్లు ఉండగా, వాటిలో 10 సీట్లను తగ్గించి, 26 సీట్లకు పరిమితం చేశారు. సీట్లను దూరం దూరంగా అమర్చారు. ఇంతవరకు నడిచే మార్గంలో దూరాన్ని తగ్గించి, కలిసి ఉన్న రెండు సీట్లను విడదీశారు. దీంతో సీట్ల మధ్య దూరం పెరిగింది. ప్రయోగాత్మకంగా తయారు చేసిన ఈ బస్సును అధికారులు ఒకే చేస్తే, ఏపీలో బస్సుల్లో పెను మార్పులు చోటుచేసుకోనున్నాయి. సీట్ల తగ్గింపు నేపథ్యంలో బస్సు ఛార్జీల్లో కూడా పెను మార్పులు చోటుచేసుకోనున్నట్టు తెలుస్తోంది.