- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కృష్ణాష్టమికి ‘రాధ’ను పరిచయం చేసిన డైరెక్టర్

దిశ, సినిమా : యంగ్ హీరో నిఖిల్, డైరెక్టర్ చందు మొండేటి కాంబినేషన్‌లో వచ్చిన ‘కార్తికేయ’ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో నిఖిల్‌కు జోడీగా కలర్స్ స్వాతి నటించగా, ఇప్పుడు అదే సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతోంది. అయితే హీరోయిన్ విషయంలో ఇప్పటిదాకా సస్పెన్స్ మెయింటైన్ చేసిన మేకర్స్.. నేడు కృష్ణాష్టమి సందర్భంగా ఎవరనేది రివీల్ చేశారు. ఆల్రెడీ నిఖిల్‌తో ‘18 పేజెస్’ చిత్రంలో నటిస్తున్న అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలోనూ నిఖిల్‌కు జంటగా నటిస్తోందని ప్రకటించిన డైరెక్టర్ చందు.. స్పెషల్ వీడియో ద్వారా ‘రాధ’ క్యారెక్టర్‌ను ప్రేక్షకులకు పరిచయం చేశాడు. కాగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై అభిషేక అగర్వాల్, టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న చిత్రానికి కీరవాణి కొడుకు కాలభైరవ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక కృష్ణాష్టమి సందర్భంగా అనుపమ పరమేశ్వరన్, కోమలి ప్రసాద్ కలిసి రాధాకృష్ణుల వేషంలో ఫొటోలకు పోజులివ్వగా.. ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.