సీఎం జగన్‌కు చంద్రబాబు బర్త్ డే విషెస్.. రాజకీయ వర్గాల్లో చర్చ

by srinivas |   ( Updated:2021-12-21 06:52:23.0  )
సీఎం జగన్‌కు చంద్రబాబు బర్త్ డే విషెస్.. రాజకీయ వర్గాల్లో చర్చ
X

దిశ, ఏపీ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 49వ ఏట అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా పార్టీలు, వర్గాలకు అతీతంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. విపక్ష నేత చంద్రబాబు సైతం సీఎం జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. “హ్యాపీ బర్త్ డే జగన్” అంటూ ట్విట్టర్ వేదికగా విషెస్ తెలిపారు. అయితే కేవలం నామమాత్రంగానే చంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేశారు. గత ఏడాది ‘ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.. ఎల్లప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నాను’అంటూ ట్వీట్ చేశారు. అయితే ఈ సారి కేవలం సాధారణ రీతిలో ఏకవాక్యంతో హ్యాపీ బర్త్ డే అంటూ తెలపడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed