- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘చాణక్య’ వ్యూహాలు విఫలమవుతున్నాయా!
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యూహాలు విఫలమవుతున్నాయనే చర్చ టీడీపీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. తమ అధినేత అపర చాణక్యుడనీ, వ్యూహాల్లో దిట్ట అని చెప్పుకునే టీడీపీ అనుయూయులు నేడు వ్యూహాల్లో ఆయన కాస్త వెనుకంజలో ఉన్నారని చర్చించుకుంటున్నారు. మండలి రద్దుకే కేంద్రం మొగ్గు చూపుతోందనీ చర్చ జరగడం, అమరావతి రైతులు సీఎం జగన్‌తో భేటీ కావడం వంటి ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకోవడంతో టీడీపీ భవిష్యత్ వ్యూహాలు ఎలా ఉంటాయనే చర్చ రాజకీయవర్గాల్లో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
మండలిలో వ్యూహం విఫలం!
సీఆర్డీఏ రద్దు, పాలనావికేంద్రీకరణ బిల్లులు అసెంబ్లీలో ఆమోదం అనంతరం మండలిలో చర్చకు వచ్చినప్పుడు రూల్ 71 ప్రయోగించి సెలెక్ట్ కమిటీకి బిల్లులు పంపే బదులు, బిల్లులను ఓటింగ్‌లో ఓడించే వ్యూహం అనుసరిస్తే టీడీపీకి భవిష్యత్ ఉండేదేమో అనే చర్చ ఇప్పుడు ఆ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఎలాగూ వైసీపీ కేంద్ర అనుమతితోనే మండలి రద్దుకు పూనుకుందనీ, రాజ్యసభలో మెజార్టీ లేకపోవడం వల్లే ఏపీ కౌన్‘సీల్’కు కేంద్ర బీజేపీ మొగ్గు చూపుతుందని, కాబట్టి మండలి విషయంలో టీడీపీ వ్యూహం విఫలమయిందనే చర్చిస్తున్నారు.
వైసీపీ వద్దకు రైతులు..
రాజధాని అమరావతే ఉండాలంటూ ఆ ప్రాంతంలో రైతులు దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇవ్వాల్టికి దీక్ష జరగబట్టి 50 రోజులు అవుతోంది. అమరావతే రాజధానిగా కొనసాగాలంటై రైతులు సహాయ నిరాకరణ చేయాలనీ, వైసీపీ ప్రజాప్రతినిధులను ప్రశ్నించాలని టీడీపీ అధినేత చంద్రబాబు సూచించారు. కానీ, నిన్న అమరావతి రైతులు ఏపీ సీఎం జగన్‌ను కలిసి రెండు గంటలపాటు తమ సమస్యలపై చర్చించారు. అన్నివిధాలా వారిని ఆదుకుంటామనీ, లెజిస్లేటివ్ రాజధానిగా అమరావతి ఉంటుందని జగన్ ప్రకటించారు. ఇది టీడీపీకి ఎదురుదెబ్బే. ఎందుకంటే అమరావతే రాజధానిగా కొనసాగాలంటూ దీక్ష చేస్తున్న రైతులుకు మద్దతుగా టీడీపీ పోరాటాలు దీర్ఘకాలం కొనసాగాలని కోరుకుంది తప్ప వారి సమస్యలపట్ల స్పందనలో కొంత సరిగాలేదని అందుకే రైతులు వైసీపీ అధినేత వద్దకు వెళ్లారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఎత్తుకు పై ఎత్తు..
అమరావతికి 33 వేల ఎకరాలు స్వచ్ఛందంగా రైతులు ఇచ్చారని టీడీపీ అధినేత చంద్రబాబు చెబుతుండగా, నిన్న ఏపీ సీఎం జగన్‌ను కలిసిన అనంతరం అమరావతి రైతులు మీడియాతో మాట్లాడుతూ సారవంతమైన తమ భూములను చంద్రబాబు బలవంతంగా లాక్కున్నారనీ, సీఆర్డీఏతో పెద్దలకే లాభం జరిగిందని చెప్పారు. ఈ మాటలూ టీడీపీకి వ్యతిరేకమైనవే. అయితే, మొదటి నుంచి అమరావతి రైతులకు న్యాయం కోసం చిత్తశుద్ధితో గట్టి వ్యూహంతో పోరాడకపోవడం వల్లే వైసీపీ ఎత్తుకు పై ఎత్తు వేసి రైతులతో చర్చలు జరిపిందనీ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మొదట స్థానిక వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలను పంపించిన అనంతరమే సీఎం జగన్ రైతులతో చర్చలు జరపడం వ్యూహంలో భాగమేనని పలువురు అంటున్నారు. ఇకనైనా సరైన వ్యూహంతో టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీని ఎదుర్కోవాలని టీడీపీ వర్గాలు కోరుకుంటున్నాయి. అయితే, అవసరమైతే భూములు వెనక్కి ఇస్తామంటున్న సీఎం జగన్ రైతులకు న్యాయం చేసేందుకు కృషి చేయాలని అన్ని పార్టీలు కోరడం మంచి విషయమే.