భూమా అఖిలప్రియకు చంద్రబాబు ఫోన్

by srinivas |
భూమా అఖిలప్రియకు చంద్రబాబు ఫోన్
X

దిశ, వెబ్‌డెస్క్: బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో ప్రధాన నిందితురాలైన భూమా అఖిలప్రియ జైలు నుంచి విడుదలయ్యారు. బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్న అఖిలప్రియకు సెషన్స్‌ కోర్టు శనివారం షరతులతో కూడిన బెయిల్‌ మంజూరుచేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా జైలు విడుదలైన అఖిలప్రియకు టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ చేశారు. ధైర్యంగా ఉండాలని ఆమెకు చెప్పారు. ఎన్ని కష్టాలు ఎదురైనా మనోనిబ్బరంతో ముందుకు సాగాలని, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని చంద్రబాబు చెప్పారు. కాగా, విడుదలైన అఖిలప్రియకు స్వాగతం పలికేందుకు ఆమె స్వంత గ్రామం ఆళ్లగడ్డ నుంచి భారీగా టీడీపీ కార్యకర్తలు హైదరాబాద్‌కు వచ్చారు.

Advertisement

Next Story