- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీ సేవకు చేతులెత్తి మొక్కుతున్నా: చంద్రబాబు
దిశ, అమరావతి బ్యూరో: జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా వైద్యులకు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. కరోనా విజృంభిస్తున్నప్పటికీ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా, అంకితభావంతో ప్రజలకు సేవచేస్తున్న వైద్యులకు చేతులెత్తి మొక్కుతున్నామన్నారు. కాగా వైద్యుల పట్ల ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి పట్ల చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ…” ‘వైద్యో నారాయణో హరిః’ అన్నారు. కరోనా విజృంభిస్తున్నప్పటికీ తమ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా, అంకితభావంతో ప్రజలకు వైద్యసేవలందిస్తోన్న దేవుళ్లకి జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా చేతులెత్తి మొక్కుతూ… హృదయపూర్వకంగా శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. ప్రాణదాతలైన వైద్యుల పట్ల ఏపీ ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యానికి బాధేస్తోంది. డాక్టర్లకు ఇప్పటికీ పీపీఈ కిట్లు అందించకపోవడం వైసీపీ ప్రభుత్వ బాధ్యతారాహిత్యం. పీపీఈల కోసం విశాఖ ఈఎన్‌టీ ఆసుపత్రిలో డాక్టర్లు ధర్నా చేశారంటే ఎంత సిగ్గుచేటు!. మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్‌ను సస్పెండ్ చేసి, నడిరోడ్డుపై అర్థనగ్నంగా, లాఠీలతో కొట్టించి, పిచ్చివాడని ముద్రవేసింది ప్రభుత్వం. ప్రపంచమంతటా డాక్టర్లపై పూలు చల్లి ప్రశంసిస్తోంటే ఏపీలో డాక్టర్ల పరిస్థితి ఇది. ఇప్పటికైనా ప్రభుత్వం వైద్యుల సేవను గుర్తించి గౌరవించాలి’’ అంటూ చంద్రబాబు ట్విట్ చేశారు.