- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘అరాచక మూకలకు ధైర్యం ఎవరిచ్చారు’
దిశ, వెబ్‌డెస్క్: రాజమండ్రి రూరల్ లో అభం శుభం తెలీని 10ఏళ్ల ముస్లిం మైనర్ బాలికపై ముగ్గురు వైసిపి యువకులు అత్యాచారాయత్నాన్ని ఖండిస్తున్నామని చంద్రబాబు అన్నారు. పైగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే చంపేస్తామని బెదిరింపులు చేయడంపై ఆయన మండిపడ్డారు. ఈ అరాచక మూకలకు ఇంత ధైర్యం ఇచ్చింది ఎవరు అంటూ నిలదీశారు. బాధిత కుటుంబానికి సంబంధించిన ఓ వీడియోను తన ట్విట్టర్‌లో షేర్ చేసిన చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
16ఏళ్ల దళిత మైనర్ బాలికపై 12మంది గ్యాంగ్ రేప్ చేసి పోలీస్ స్టేషన్ ముందే వదిలేసిన దుర్ఘటన కళ్లముందే ఉందని గుర్తు చేశారు. అటు కర్నూలులో గిరిజన మహిళను భర్త కళ్లముందే అతిదారుణంగా గ్యాంగ్ రేప్ చేశారని చెప్పారు. దిశచట్టం అసలు అమల్లో ఉందా? ఇప్పటికైనా పోలీసులు నిద్రమత్తు వీడి నిందితులపై కఠినచర్యలు తీసుకోవాలని చంద్రబాబు ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు.