స్నేహితుడ్ని సర్‌ప్రైజ్ చేసిన చంద్రబాబు

by srinivas |
స్నేహితుడ్ని సర్‌ప్రైజ్ చేసిన చంద్రబాబు
X

సిరియస్ రాజకీయనాయకుడిగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును పేర్కొంటారు. రాజకీయ అనుబంధాలే తప్ప ఇతరులతో ఆయన పెద్దగా కలిసిన సందర్భాలు ఉండవని ఆయన సన్నిహితులు పేర్కొంటుంటారు. అలాంటి చంద్రబాబునాయుడు తన స్నేహితుడ్ని సర్‌ప్రైజ్ చేసిన ఘటన సొంత నియోజకవర్గంలో చోటుచేసుకుంది. దాని వివరాల్లోకి వెళ్తే…

ప్రజా చైతన్య యాత్రలో భాగంగా చంద్రబాబునాయుడు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో కంగుంది గ్రామంలో కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన ఎస్వీ యూనివర్సిటీ సహాధ్యాయి రత్నం నివాసానికి వెళ్లి సర్‌ప్రైజ్ చేశారు. యూనివర్సిటీలో చదువుతున్న రోజుల్లో దిగిన ఫోటోను రత్నం చూపించారని బాబు తెలిపారు. దీంతో ఒక్కసారిగా గతంలోకి వెళ్లిపోయానని బాబు చెప్పారు.

ఆనాటి స్నేహాలు, చదువుతున్న రోజులు అన్నీ గుర్తొచ్చాయని అన్నారు. గతస్మృతుల్లోకి వెళ్లడంతో మనసుకు తెలియని ఉత్సాహం కలిగిందని ఆయన ట్విట్టర్ మాధ్యమంగా తెలిపారు. ఈ సందర్భంగా ఆనాటి ఫోటోను తన ట్వీట్‌కు చంద్రబాబు జతచేశారు. ఆ ఫోటోలో చేతులు కట్టుకుని ఒద్దికగా కూర్చున్న చంద్రబాబు ఆకర్షిస్తారు.

Advertisement

Next Story

Most Viewed