టీటీడీకి చంద్రబాబు ఫ్యామిలీ భారీ విరాళం

by srinivas |
babu family
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల తిరుపతి దేవస్థానం అన్నదానం ట్రస్ట్ కి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుటుంబం భారీ విరాళం అందించింది. చంద్రబాబు మనవడు, నారా లోకేశ్ తనయుడు దేవాన్ష్‌ బర్త్‌డే సందర్భంగా రూ.30 లక్షల విరాళం అందించారు. ప్రతియేటా దేవాన్ష్‌ బర్త్‌డే రోజున చంద్రబాబు కుటుంబసభ్యులు టీటీడీ అన్నదానం ట్రస్ట్‌కి విరాళం ఇస్తున్నారు. తాజాగా ఈ ఏడాది కూడా చెక్కును టీటీడీ అధికారులకు పంపారు.

Advertisement

Next Story