- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాళ్లు సంస్కార హీనులు: నందిగం సురేశ్
దిశ,వెబ్‌డెస్క్: పేదల ఇండ్లను బాత్ రూంలతో పోల్చిన సంస్కార హీనులు చంద్రబాబు, లోకేశ్‌లు అని బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ అన్నారు. చంద్రబాబు బినామి రాజధాని అమరావతి అని విమర్శించారు. అమరావతిలో పేదవాడికి చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు. పేదలపై ప్రేమ ఉంటే ఇండ్ల పట్టాలను ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. ఇండ్ల పట్టాల పంపిణీపై కోర్టులో వేసిన పిటిషన్‌ను వారు వెనక్కి తీసుకోవాలని అన్నారు.
అమరావతి రైతులను బెదిరించి చంద్రబాబు భూములు లాక్కున్నారని ఆరోపించారు. అమరావతిలో ఉద్యమం చేసింది రియల్ ఎస్టేట్ వ్యాపారులే అని పేర్కొన్నారు. అమరావతి అభివృద్దిపై నారా లోకేశ్‌కు ఆయన సవాల్ విసిరారు. అమరావతిపై బహిరంగ చర్చకు లోకేశ్ సిద్దమా అని ప్రశ్నించారు. బహిరంగ చర్చకు ఎప్పుడైనా తాను సిద్దమని చెప్పారు. తన సవాల్‌ను స్వీకరించి లోక్‌శ్ చర్చకు రావాలని అన్నారు. ట్విట్టర్‌లో కాకుండా డైరెక్ట్‌గా చర్చకు రావాలని డిమాండ్ చేశారు.