స్క్రాప్‌తో బైక్ రూపొందించిన టెన్త్ క్లాస్ కుర్రాడు

by  |
స్క్రాప్‌తో బైక్ రూపొందించిన టెన్త్ క్లాస్ కుర్రాడు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియాలో.. వెహికల్ రీమాడిఫికేషన్స్ కాస్త ఎక్కువగానే జరుగుతుంటాయి. రిక్షాలకు, కార్గో ట్రై సైకిళ్లకు వెహికల్ మోటార్ అటాచ్ చేసేసి కొత్త రకం బైక్‌లకు ప్రాణం పోస్తుంటారు. మెకానిక్స్ ఇలాంటి ఇన్నోవేటివ్ ప్రయత్నాలు చేయడం సాధారణమే. కానీ, చండీఘర్‌కు చెందిన ఓ పదో తరగతి కుర్రాడు గౌరవ్.. వివిధ రకాల బైక్ పార్ట్స్‌తో మరో బైక్‌ను తయారుచేశాడు. తన టాలెంట్‌కు ఫిదా అయిన నెటిజన్లు గౌరవ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

గౌరవ్ రూపొందించిన బైక్ భలే వినూత్నంగా ఉంది. పెట్రోల్‌తో నడిచే ఈ బైక్.. యావరేజ్‌గా లీటరుకు 80 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని చెబుతున్నాడు. బైక్ ముందు భాగంలో సైకిల్‌ టైరు బిగించడంతో యూనిక్ లుక్ వచ్చింది. అంతేకాకుండా పలు రకాల బైక్‌ పార్ట్స్‌ మిక్స్ చేయడంతో ఇంకాస్త డిఫరెంట్‌గా కనిపిస్తోంది. దాంతో ఈ బైక్ రోడ్ల మీద కంటే.. నెట్టింట్లోనే ఎక్కువగా చక్కర్లు కొడుతోంది. అయితే, గౌరవ్‌ బైక్ రూపొందించడం ఇదేం తొలిసారి కాదు. మూడు సంవత్సరాల క్రితం కూడా స్క్రాప్ పార్ట్స్‌తో ఎలక్ట్రిక్ బైక్ రూపొందించడం విశేషం.

Read Also…

స్వర్గంలో ఉన్న పిల్లికి లేఖ..

Next Story