- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ మంచిదే : రవిశాస్త్రి

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ చర్చనీయాంశమైంది. రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌లాంటి స్టార్ ప్లేయర్లతోపాటు పలువురు మాజీ క్రికెటర్లు ఈ రూల్‌పై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే, టీమ్ ఇండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి మాత్రం ఈ రూల్‌ను సమర్థించారు. తాజాగా భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ చానెల్‌లో రవిశాస్త్రి ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై స్పందిస్తూ.. ఈ రూల్ వల్లే ఉత్కంఠభరితమైన ముగింపులను చూస్తున్నామని చెప్పాడు.
‘ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ మంచిదే. కాలంతోపాటు మనమూ మారాలి. ఇతర క్రీడల్లోనూ ఇలాంటివి ఉన్నాయి. ఇది మంచి నిబంధననే అని అనుకుంటున్నా. ఐపీఎల్‌లో ఈ రూల్ వల్ల ఉత్కంఠభరితమైన ముగింపులను చూశాం. ఇది చాలా పెద్ద మార్పే. ఏదైనా కొత్త రూల్ వస్తే దాన్ని వ్యతిరేకించేందుకు ప్రయత్నిస్తారు. కానీ, 200, 190 స్కోర్లను చూస్తే ఆటగాళ్లు ఆ అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకున్నారో తెలుస్తోంది. అప్పుడు ఈ రూల్‌పై పునరాలోచన చేస్తారు’ అని చెప్పుకొచ్చాడు. కాగా, ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై విమర్శలు రావడంతో ఇటీవల బీసీసీఐ సెక్రెటరీ జైషా స్పందించిన విషయం తెలిసిందే. ఈ రూల్ శాశ్వతమైనది కాదని, టోర్నీ తర్వాత ఆటగాళ్లు, ఫ్రాంచైజీలు, బ్రాడ్‌కాస్టర్లతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని తెలిపాడు.