- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వేయి మంది ఈటల రాజేందర్‌లు కావాలి : టీఆర్ఎస్ ఎమ్మెల్యే
దిశ, కమలాపూర్: హుజరాబాద్ నియోజకవర్గంలో ప్రభుత్వానికి గోరి కడతాను అన్న ఈటల మాటలను ఉద్దేశించి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 1000 మంది ఈటల రాజేందర్ అటువంటి వాళ్ళు వచ్చిన టీఆర్ఎస్‌ను ఏమి చేయలేరని ఎద్దేవా చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలంలోని ఉప్పల్, ఉప్పలపల్లి, భీంపల్లి, గుండెడు, కొత్తపల్లి, కన్నూరు గ్రామాలలో శుక్రవారం ఏర్పాటుచేసిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టి ఈటల ఆత్మగౌరవం మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు.
బీజేపీలో చేరిన మరుక్షణం నుండే ఈటెల పతనం ప్రారంభమైందని ,తెలంగాణకు ద్రోహం చేయాలనుకునే బీజేపీతో చేరిన ఈటల రాజేందర్‌కు ప్రజల గుణపాఠం చెబుతారన్నారు. ఆరు సార్లు గెలిచిన అని గొప్పలు చెప్పుకునే ఈటల హుజురాబాద్ నియోజకవర్గంలో అంధకారంలో ఉంచారని, ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరైన నియోజకవర్గం అభివృద్ధి పనులు ఈటల చేయలేదన్నారు. అదే విధంగా ఇప్పుడు ఈటల ఏం చెప్పు కొని గ్రామాలకు వెళ్లి ఓట్లు అడుగుతారు అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మండల ఇంఛార్జ్ పెరియాల రవీందర్ రావు, జెడ్పీ చైర్ పర్సన్ ఏం. సుధీర్ బాబు, నాయకులు పేరాల సంపత్రావు, లాండిగే లక్ష్మణ్ రావు, ప్రదీప్ రెడ్డి, పోరండ్ల కృష్ణ ప్రసాద్ ఆయ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు మరియు నాయకులు పాల్గొన్నారు