- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ముంచుకొస్తున్న మార్చి 31 గడువు.. నాణ్యతకు తిలోదకాలు..

దిశ,తిమ్మాపూర్ : ముంచుకొస్తున్న మార్చి గడువుతో మానకొండూర్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత కొరవడుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని చోట్ల ఎలాగైనా మార్చి 31లోపు పనులు చేయాలనే హడావిడిలో పలువురు కాంట్రాక్టర్ అడ్డదార్లు తొక్కుతూ తూతూమంత్రంగా పనులు చేపడుతున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు చెందిన క్యాంపు పరిధిలోని పలు రహదారులపై సీసీ రహదారుల నిర్మాణాలు జరుగుతున్నాయి. కాగా ఎస్సారెస్పి స్థలాల్లో ఎలాంటి నిర్మా ణాలు చేయాలన్నా ముందస్తుగా సంబంధిత అధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉం టుంది.అయితే కొందరు కాంట్రాక్టర్లు ఈ నియమాన్ని ఉల్లంఘించి ఎస్సారెస్పీ స్థలాల్లో కూడా సీసీ రహదారులు నిర్మించడం చర్చనీయాంశమవుతోంది.
ఎస్సారెస్పీ స్థలాల్లోనూ సీసీ రహదారులు..
2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులను ఈ ఆర్థిక సంవత్సరం మార్చి 31వ తేదీ లోపు చేపడితేనే చేసిన పనులకు బిల్లులు మంజూరు అవుతాయానే కారణంతో నియోజకవర్గంలోని పలు చోట్ల అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్న క్రమంలో నాణ్యతకు తిలోదకాలిస్తూ పనులు జరుపుతున్నారనే విమర్శలు విన్పిస్తున్నాయి. ఎలాగైనా మార్చి 31 లోపు పనులు చేపట్టి చేసిన పనులకు సంబంధించి బిల్లులు రికార్డులు చేయించుకోవాలనే తొందరలో పలు చోట్ల రాత్రికి రాత్రే సీసీ రహదారుల నిర్మాణాలు ఇతర అభివృద్ధి పనులు జరుగుతున్నాయానే అభిప్రాయాలు విన్పిస్తున్నాయి.ఇదిలా ఉండగా ఎస్సారెస్పీ స్థలాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలన్నా ముందస్తుగా ఎస్సారెస్పీ సంబంధిత కార్యాలయాల్లో రాత పూర్వక అనుమతి పొంది పనులు చేయాల్సి ఉండగా మార్చి 31 గడువు ముంచుకు వస్తుండడంతో ఇలాంటి నియమాలేమి పాటించకుండానే ఎస్సారెస్పీకి చెందిన స్థలాల్లో దర్జాగా సీసీ రోడ్ల నిర్మాణాలు జరిగిపోతున్నాయి. ఇటీవల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం చుట్టూ ఉన్న ఎస్సారెస్పీకి చెందిన రెండు రహదారులపై సీసీ రహదారుల నిర్మాణం జరుగుతుండడం చర్చనీయాంశమైంది.ఎ మహత్మా నగర్ గ్రామ పంచాయతీ నుంచి పంచముఖ హనుమాన్ దేవాలయం వరకు ఉన్న ఎస్సారెస్పీ రహదారి పై దాదాపు రూ. 50లక్షలతో కూడా సీసీ నిర్మాణం జరగడం విమర్శలకు దారి తీస్తోంది.
కన్నెత్తి చూడని అధికారులు..
దాదాపు రోజుల వ్యవధిలోనే పలు చోట్ల సీసీ రహదారుల నిర్మాణం జరుగుతుండడంతో కాంట్రాక్టర్లు పనుల్లో నాణ్యతకు తూట్లు పొడుస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్న నాణ్యతను పరిశీలించాల్సిన సంబంధిత అధికారులు మామూళ్ల మాటున అటు వైపు కన్నెత్తి కూడా చూడడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి నాణ్యతకు తిలోదకాలిస్తూ చేపడుతున్న పలు అభివృద్ధి పనులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే బిల్లులు చెల్లించాలని, ఎస్సారెస్పీ స్థలాల్లో చేపట్టిన పనులకు సంబంధిత ఆధికారుల అనుమతి పత్రాలు పరిశీలించడం తో పాటు చేసిన పనుల నాణ్యతను పరిశీలించిన తర్వాతే బిల్లులు చెల్లించాలనే డిమాండ్లు చేస్తున్నారు. ఎస్సారెస్పీ స్థలాల్లో సీసీ రహదారుల నిర్మాణం విషయమై సంబంధిత క్యాంపు ఈ ఈ నాగభూషణంను వివరణ కోరగా, ఎస్సారెస్పీ స్థలాల్లో సీసీ రహదారుల నిర్మాణానికి తాము ఎలాంటి రాతపూర్వక అనుమతి ఇవ్వలేదని పేర్కొన్నారు.