- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆ చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలి.. CPI డిమాండ్
దిశ, చౌటుప్పల్: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని పాఠ్య పుస్తకాలలో చేర్చాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ సాయుధ పోరాట 74వ వార్షికోత్సవాల సందర్భంగా సీపీఐ ఆధ్వర్యంలో బస్సుయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ బస్సుయాత్ర శనివారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం చాడ మాట్లాడుతూ.. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ పాత్ర కీలకమైనదని చెప్పారు. ఎర్రజెండా అండతో కత్తులు, బడిశలతో భూస్వాముల, జమీందారులను పారదోలిన వీర వనిత ఐలమ్మ అన్నారు.
నేడు బీజేపీ నాయకులు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని హిందూ ముస్లింల మధ్య అల్లర్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ సంస్థానంలో రాచరికపు పాలనను నిర్ములించేందుకు హిందువులు, ముస్లింలు కలిసి చేసిన పోరాటం అనే చారిత్రక సత్యాన్ని గ్రహించాలని అన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17న తెలంగాణకు అసలు స్వాతంత్రం వచ్చిందని తెలిపారు. ఈ యాత్రలో సీపీఐ రాష్ట్ర నాయకులు పల్లా నరసింహా రెడ్డి, పద్మ, ఉజ్జిని రత్నాకర్ రావు, గోదా శ్రీరాములు, నెల్లికంటి సత్యం, దామోదర రెడ్డి, శేఖర్ రెడ్డి, పగిల్ల మోహన్ రెడ్డి, గాలయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు.