- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీజేఐని కలిసిన నేతన్నల ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్
దిశ, తెలంగాణ బ్యూరో : ఉల్లంఘనకు గురవుతున్న 1985 హ్యాండ్లూమ్ రిజర్వేషన్ చట్టాన్ని పటిష్ట పర్చాలని నేతన్నల ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్ దాసు సురేశ్ కోరారు. ఆదివారం ఢిల్లీలోని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణను కలిసి చేనేత సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ దేశ ప్రాచీన సాంప్రదాయ కళ, వారసత్వ సంపద అయిన చేనేతకళ నేడు క్రమంగా అంతరిస్తూ అనేక టెక్స్‌టైల్ తయారీదారులు, పారిశ్రామికవేత్తలు, విక్రయదారుల అనైతిక పద్ధతులతో ఉనికిని కోల్పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
11 రకాల చేనేత వస్త్రాలను మరమగ్గాలపై నేయకూడదనే నిబంధనతో 1985 లో పార్లమెంటులో రూపొందించిన హ్యాండ్లూమ్ రిజర్వేషన్ చట్టం క్షేత్రస్థాయిలో ఉల్లంఘనకు లోనవడంతో నకిలీ చేనేత వస్త్రాలు రాజ్యమేలుతూ రోజంతా కష్టపడి పనిచేసే నేతన్నల నడ్డి విరుస్తూ వారు ఆత్మహత్యలకు పాల్పడేలా పరిస్థితులు మారుతున్నాయన్నారు. ప్రతీ చేనేత వస్త్రానికి హ్యాండ్లూమ్ మార్క్ విధిగా వేయాలని చట్టం చెబుతున్నా, ప్రతీ చేనేత వస్త్రానికి కార్మికుడి జియోటాగ్ నంబర్ ను జతపర్చి నకిలీలను సంపూర్ణంగా నిరోధించే అవకాశం ఉన్నా ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
అసలు బంగారానికి 1 గ్రామ్ గోల్డ్‌కు ఉన్న తేడానే ఈ నకిలీ చేనేత వస్త్రాలకు కూడా వర్తిస్తుందని, వాస్తవాలను ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నాలను ప్రభుత్వాలు కొనసాగించడం లేదని దాసు సురేశ్ వివరించారు. ఈ చట్టాన్ని ఉల్లంగించి నకిలీ చేనేత వస్త్రాలను తయారు చేసినా, అమ్మినా, ఎక్స్ పోర్ట్ చేసినా ఇండియన్ పీనల్ కోడ్ చట్టం ప్రకారం సంబంధిత పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదు చేయవచ్చని చట్టం చెబుతున్నా ప్రభుత్వాలు అందుకు తగిన ప్రచారం కల్పించడం లేదని వాపోయారు. హ్యాండ్లూమ్ రిజర్వేషన్ చట్టం ఉల్లంఘన చేనేత పరిశ్రమకు నష్టం కలిగిస్తుండటంతో చేనేత కార్మికుల ఆర్థిక ఇబ్బందులు పెరగడం, కష్టాలను భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. స్పందించిన సీజే రమణ.. సమస్యలను సత్వరమే పరిశీలించిన సాధ్యమైన సాయం చేస్తానని హామీ ఇచ్చారు.