చైన్ స్నాచింగ్.. మహిళపై కత్తితో దాడి

by srinivas |
చైన్ స్నాచింగ్.. మహిళపై కత్తితో దాడి
X

దిశ, వెబ్‌డెస్క్: విశాఖపట్టణం జిల్లా నడుపూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతున్న సత్యగీత అనే మహిళ మెడలోంచి నుంచి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు చైన్ లాక్కునే ప్రయత్నం చేశారు. వెంటనే అప్రమత్తమైన మహిళ ప్రతిఘటించడంతో కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో సత్యగీత చేయికి తీవ్ర గాయం అయింది. గమనించిన స్థానికులు హుటాహుటిన దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని, ఘటనా స్థలంలో లభ్యమైన కత్తిని స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Next Story