- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సిగరెట్ కావాలని వచ్చి.. పుస్తెలతాడు అపహరణ
by Sumithra |

X
దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లో మరోసారి చైన్ స్నాచర్స్ రెచ్చిపోయారు. సిగరెట్ కొంటున్నట్లు నటించి షాపు యజమానురాలి మెడలో ఉన్న పుస్తెల తాడును అపహరించారు. ఎల్బీ నగర్ పరిధిలోని బైరామల్ గూడ మల్లికార్జున నగర్‌లో కనకదుర్గ కిరణ షాపు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. షాపు వద్దకు వచ్చిన దుండగుడు సిగరెట్, చిప్స్ కావాలని అడిగి షాపులో ఉన్న సుజాత(55) మెడలోంచి నాలుగు తులాల మంగళసూత్రాన్ని గుంజుకుని పరారీ అయ్యాడు. వెంటనే బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story