- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ చట్టాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేశాయి : చాడ వెంకటరెడ్డి
దిశ, సిద్దిపేట: హుజూరాబాద్ లో జరుగుతున్న ఉప ఎన్నికలను గిన్నిస్ రికార్డులోకి ఎక్కించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఎద్దేవా చేశారు. జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి మంద పవన్ తో కలిసి చాడ వెంకటరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సమాచార హక్కు చట్టంను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నాయని మండి పడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం వదిలి, ఎన్నికలలో గెలుపు కోసం పాకులాడుతోందని దుయ్యబట్టారు. కోట్ల రూపాయల వ్యయం తో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా కోటి ఎకరాల మాగాణి కి నీరు అందిస్తామని చెప్పి, నేడు వరిసాగు చేయవద్దని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు.
వరిసాగు పై సిద్దిపేట జిల్లా కలెక్టర్ మాట్లాడిన పదాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెట్రో ధరలపై నియంత్రణ అధికారం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం పై ఉన్నా, సబ్సిడీ కల్పించే అధికారం రాష్ట్రాలకు ఉంటుందని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సిలిండర్ పై 25 రూపాయలు సబ్సిడీ కల్పించారని గుర్తు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహజ వనరులను దోచుకొని దాచుకుంటున్నారని మండి పడ్డారు