- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నోటిఫికేషన్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం : సీజీజీ ప్రకటన
దిశ, డైనమిక్ బ్యూరో : నోటిఫికేషన్లు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉన్నామని సీజీజీ డైరెక్టర్ వెల్లడించారు. ‘దిశ’ పత్రికలో ఈ నెల 21న ప్రచురితమైన ‘కొలువులకు కొర్రీలు’ కథనానికి స్పందిస్తూ సోమవారం వివరణ ఇచ్చారు. సీజీజీలో ఉద్యోగుల కొరత లేదని, ఎప్పటికప్పుడు రిక్రూట్ చేసుకుంటున్నామని ప్రకటించింది. అంతేకాకుండా టీఎస్పీఎస్సీలో కూడా ఖాళీలు ఏర్పడగానే రిక్రూట్ చేసుకుంటున్నారని, నోటిఫికేషన్లు వచ్చినా అంతా సిద్ధంగా ఉన్నామని సీజీజీ వెల్లడించింది.
సీజీజీలో అవసరానికి తగ్గట్టు ఖాళీ అయిన పోస్టుల భర్తీ, కొత్తగా నియామకమైన పోస్టుల గురించి పూర్తి వివరాలు తెలిపారు. గత ఏడేళ్లుగా 108 నోటిఫికేషన్లలో 36,792 ఉద్యోగాలకు 50 లక్షల అప్లికేషన్లు వచ్చాయని, టీఎస్పీఎస్సీ వెబ్సైట్ ఆటోమేటిక్ గా ఎంట్రీలను తీసుకునేలా సాఫ్ట్ వేర్ అందుబాటులో ఉందని తెలిపారు. అంతేకాకుండా సీజీజీలో పర్మినెంట్ పోస్టులనేవి ఉండవని, నిర్ణీత కాలం కోసం కాంట్రాక్టు ఉద్యోగులను తీసుకుని వారి సేవలను వినియోగించుకుంటామని స్పష్టం చేశారు. సంస్థలో ఉన్న సిబ్బందిలో కూడా 50 శాతం మంది సాఫ్ట్ వేర్ డెవలపర్లు ఉన్నారని తెలిపారు.