- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Viral video: ఈ కుక్క యాక్టింగ్‌కి హ్యాట్సాఫ్.. ఎంతో స్మార్ట్‌గా పాపను కాపాడిందిగా..!

దిశ, వెబ్ డెస్క్: కుక్క (Dog).. విశ్వాసానికి మారు పేరు. ఒక్కసారి మనం సాయం చేసిన అవి జీవితాంతం మనకు ఋణపడి ఉంటాయి. అలాంటిది తమను ప్రేమగా పెంచుకునే యజమానుల విషయాల్లో ఇంకేంతా విశ్వాసంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రమాదాలు ఎదురైనప్పుడు తమ యజమానులను కాపాడుకునేందుకు తమ ప్రాణాలకు సైతం తెగిస్తాయి. ఇలాంటి వార్తలు కూడా మనం తరచూ వింటుంటాం. ఇక తాజాగా ఓ కుక్క కూడా ఎంతో తెలివిగా తమ యజమాని కుతూరిని కాపాడింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట షేర్ చేయగా, వైరల్ (Viral) అవుతోంది.
ఓ ఇంటి కాంపౌడ్‌లో పెంపుడు కుక్క కూర్చొని ఉంది. పక్కనే ఓ పాప ఆడుకుంటోంది. ఇంతలో ఓ వ్యక్తి గన్ పట్టుకుని గేట్ తెరుచుకుని ఇంట్లోకి ప్రవేశించబోయాడు. కుక్కను గమనించి దాన్ని గన్‌తో షూట్ చేశాడు. వెంటనే ఆ కుక్క స్పృహా తప్పి పడిపోయింది. కుక్క చనిపోయిందనుకుని ఆ వ్యక్తి వచ్చి పాపను ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశాడు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఆ కుక్క గబుక్కున ఒక్కసారిగా లేచి వచ్చి అతడి చేయిని గట్టిగా నోటితో పట్టుకుంది. దీంతో అతడు పాపను వదిలేశాడు. అయినా కూడా కుక్క అతడి చేయి వదలకుండా అలాగే పట్టుకుని ఉంది. ఈ దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డు అవ్వటంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీడియో చూసిన నెటిజన్లు కుక్క తెలివిని ప్రశంసిస్తున్నారు. నేరస్థుడి నుంచి పాపను కాపాడటంలో ఎంతో తెలివి ప్రదర్శించిందని కామెంట్లు పెడుతున్నారు. అయితే, ఈ ఘటన ఏ ప్రాంతానికి సంబంధించినదో తెలియలేదు.