- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జమ్ము కశ్మీర్ జాబ్ రూల్స్ పై కేంద్రం యూటర్న్
శ్రీనగర్ : కశ్మీరీల స్థానికత, ఉద్యోగ రిజర్వేషన్లకు సంబంధించి తీసుకొచ్చిన కొత్త నిబంధనలపై కేంద్రం యూటర్న్ తీసుకుంది. రెండు రోజులక్రితం నోటిఫై చేసిన ఈ రూల్స్ పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఎన్ సి, పీడీపీ సహా జమ్ము కశ్మీర్ బీజేపీ యూనిట్ కూడా విమర్శించింది. దీంతో కేంద్రం వెనుకడుగు వేయక తప్పలేదు. రెండు రోజుల క్రితం ప్రకటించిన సుమారు 180 మార్పులను కాదని శుక్రవారం రాత్రి మరో ప్రకటన వెలువరించింది. కేంద్ర పాలిత ప్రాంతం జమ్ము కశ్మీర్ లో 15 ఏళ్లుగా నివసిస్తున్నవారికే ఆ ప్రాంతంలోని ఉద్యోగాలన్ని రిజర్వ్ గా ఉంటాయని తాజా ప్రకటనలో పేర్కొంది.
జమ్ము కశ్మీర్ రాష్ట్ర స్వయంప్రతిపత్తి తొలగించి.. రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన ఎనిమిది నెలల తర్వాత కశ్మీర్ స్థానికత, ఆ ప్రాంత ఉద్యోగాలకు సంబంధించి రెండు రోజుల క్రితం ప్రకటన చేసింది. కశ్మీర్ స్థానికతను పొందే నిబంధనల సరళీకరణే కాదు ప్రభుత్వ లోయర్ లెవెల్ ఉద్యోగాలను మాత్రమే వారికి రిజర్వ్ చేసింది. ఉన్నత ఉద్యోగాలకు కశ్మీరేతరులకూ అవకాశం కల్పించింది. ఈ నిర్ణయం కశ్మీరీలను మరింత అవమానించడమే తప్ప మరొకటి కాదని మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా విమర్శించిన విషయం తెలిసిందే. కశ్మీర్ లోని అన్ని రాజకీయ పార్టీలు ఈ నిర్ణయాన్ని తప్పు పట్టాయి. దీంతో తాజాగా ఆ ప్రాంతంలోని అన్ని ఉద్యోగాలను కశ్మీరీలకే రిజర్వ్ చేయడంతోపాటు… ఆ రీజియన్ లో 15 ఏళ్లు నివసించినవారికే కశ్మీరీ స్థానికత లభిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.
Tags: Domicile, jammu kashmir, government, jobs, reservation, centre, overturn