ఆ కంపెనీలకు కేంద్రం నుంచి ప్రత్యేక నగదు

by Harish |
ఆ కంపెనీలకు కేంద్రం నుంచి ప్రత్యేక నగదు
X

దిశ, వెబ్‌డెస్క్: స్మార్ట్‌ఫోన్ అసెంబుల్ పరిశ్రమ నిర్మాణానికి, ఎలక్ట్రానిక్స్ సరఫరా వ్యవస్థను బలోపేతం చేసేందుకు దేశీయంగా సెమీ కండక్టర్ తయారీ కేంద్రాల ఏర్పాటు కోసం కేంద్రం ప్రత్యేక నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. ‘మేక్ ఇన్ ఇండియా’లో భాగంగా చిప్ ఫాబ్రికేషన్ యూనిట్లను ఏర్పాటు చేసే కంపెనీలు కేంద్ర ప్రభుత్వం సుమారు రూ. 7 వేల కోట్లకు పైగా నగదు ప్రోత్సాహకాలను ఇవ్వనున్నట్టు ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. చైనా తర్వాత భారత్‌ను రెండో అతిపెద్ద మొబైల్ తయారీదారిగా అంతర్జాతీయ మార్కెట్లో నిలిచేందుకు ఈ చర్యలు సహాయపడనున్నట్టు కేంద్రం భావిస్తోంది. అలాగే, కంపెనీలు తయారు చేయబోయే చిప్‌లను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు. అయితే, ఈ నగదు ప్రోత్సాహకానికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయని ఆయన పేర్కొన్నారు. ఇటీవల ప్రపంచ మార్కెట్లో ఆటో, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల్లో చిప్‌ల కొరత భారీగా ఉంది. దీని పరిష్కారానికి అంతర్జాతీయ కంపెనీలు తైవాన్ వంటి దేశాల వైపు చూస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story