పోలీసుల చర్యలతో ఒక్క రైతు మరణించలేదు.. కేంద్ర వ్యవసాయ మంత్రి

by Shamantha N |
naredrasing thomar
X

న్యూఢిల్లీ: కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏడాదికి పైగా జరిగిన రైతు నిరసనల్లో ఏ ఒక్కరూ పోలీసు లాఠీ చార్జీలో మరణించలేదని తెలిపారు. రాజ్యసభలో రాతపూర్వక సమాధానంగా ఓ ప్రశ్నకు శుక్రవారం ఆయన బదులిచ్చారు. ‘పరిహారం విషయానికి వస్తే, రైతు ఉద్యమంలో చనిపోయిన రైతుల కుటుంబాలకు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు వెంట ఉన్నాయి’ అని పేర్కొన్నారు.

రైతు నిరసనల్లో ఏ ఒక్కరూ కూడా పోలీసు చర్యలతో చనిపోలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ ప్రసాద్, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అడిగిన ఉమ్మడి ప్రశ్నకు తోమర్ బదులిచ్చారు. అలాగే కనీస మద్దతు ధరపై సందేహాలకు సమాధానంగా ‘జీరో బడ్జెట్ ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ఒక అధికారిక కమిటీ ఏర్పాటు చేస్తాం. దీంతో పాటు దేశ అవసరాలకు తగ్గట్టుగా పంట మార్పిడి చేస్తూ, ఎంఎస్పీ సమర్ధవంతంగా, పారదర్శకంగా తీసుకొస్తాం’ అని అన్నారు. కేంద్ర రైతు సంఘాల డిమాండ్లకు సానుకూలంగా స్పందించడంతో రైతులు నిరసన విరమిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed