రికవరీ పేషెంట్లకు కేంద్రం సూచనలు

by  |
రికవరీ పేషెంట్లకు కేంద్రం సూచనలు
X

న్యూఢిల్లీ: కరోనా నెగెటివ్ రిపోర్టు వచ్చినప్పటికీ పలు ఆరోగ్య సమస్యలతో హాస్పిటళ్లకు చేరుతున్నవారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం రికవరీ పేషెంట్లకు కొన్ని సూచనలు చేసింది. రికవరీ అయిన తర్వాత కూడా ఆరోగ్యాన్ని నిశితంగా పరిశీలిస్తూనే ఉండాలని తెలిపింది. ఉదయం, సాయంత్రంపూట వాకింగ్, యోగా చేయడం, వ్యాధి నిరోధక శక్తి పెంచుకునే ఆహారం తినడం చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది.

వేడి నీరు తాగాలని, ఆయుష్ మినిస్ట్రీ పేర్కొన్న చ్యవన్‌ప్రాశ్, ఇతర లేహ్యాలను తినాలని పేర్కొంది. అలాగే, కరోనా నిబంధనలను పాటించాలని, మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం చేయాలని సూచించింది. కరోనా తీవ్రస్థాయిలో ప్రభావితం చేసిన పేషెంట్లు వైరస్ నెగెటివ్ వచ్చిన తర్వాత కూడా ఒళ్లు నొప్పులు, నీరసం, దగ్గు, గొంతులో మంట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిలాంటి సమస్యలు కొంతకాలం అలాగే కొనసాగుతాయని తెలిపింది.


Next Story

Most Viewed