గుడ్ న్యూస్.. త్వరలో వాటి ధరలు తగ్గే అవకాశం

by  |   ( Updated:2021-10-10 06:30:00.0  )
OIL1
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా భారీగా పెరుగుతున్న వంటనూనెల ధరలను నియంత్రించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దీనికోసం ఎగుమతి, దిగుమతిదారులను మినహాయించి మిగిలిన వ్యాపారుల వద్ద నిల్వ ఉంచుకునే వంటనూనె, నూనె గింజలకు సంబంధించి పరిమితిని విధిస్తున్నట్టు వెల్లడించింది. ఈ నిబంధన వల్ల త్వరలో వంట నూనె ధరలు సాధారణ స్థాయికి చేరుకుంటాయని భావిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. ‘కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ద్వారా వంటనూనె ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. దీనివల్ల దేశంలోని ప్రజలకు ఊరట లభిస్తుందని’ ఆహార, వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. దీనికి సంబంధించిన తాజా నిబంధనల ఆదేశాలను రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతాలకు జారీ చేశామని, ప్రస్తుతం ఉన్న నిల్వలు, వాటి వినియోగం గురించి పరిమితులపై నిర్ణయం తీసుకోవాలని కేంద్రం సూచించింది. ఇక, ఎగుమతి, దిగుమతిదారులకు ఇచ్చిన మినహాయింపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ వారి కోడ్ ఇచ్చిన వారికి మాత్రమే వర్తిస్తుందని పేర్కొంది. ప్రస్తుతం దేశంలో అన్ని రకాల వంటనూనెల ధరలు సగటున గతేడాది కంటే 46 శాతం ఎక్కువగా ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed