కరోనాను ‘విపత్తు’గా గుర్తించిన కేంద్రం

by Shamantha N |
కరోనాను ‘విపత్తు’గా గుర్తించిన కేంద్రం
X

న్యూఢిల్లీ : కరోనావైరస్ మహమ్మారిని కేంద్ర ప్రభుత్వం విపత్తుగా గుర్తించింది. వైరస్ బారిన పడ్డవారికి, ఈ వైరస్ కారణంగా మరణించినవారికి పరిహారం అందించేందుకు వీలుగా ఈ విపత్తును నోటిఫైడ్ డిజాస్టర్‌గా ప్రకటించింది. నోటిఫైడ్ డిజాస్టర్‌గా ప్రకటిస్తే.. విపత్తును ఎదుర్కొనేందుకు నిధులను డిజాస్టర్స్ రెస్పాన్స్ ఫండ్(ఎస్‌డీఆర్ఎఫ్) నుంచి ఆయా రాష్ట్రాలు నిధులను ఖర్చు పెట్టొచ్చు. హోం మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఈ వైరస్ వల్ల మరణించినవారి కుటుంబ సభ్యులకు రూ. 4 లక్షల పరిహారం, ఈ వైరస్ బారినపడ్డవారికి చికిత్స ఖర్చును ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని పేర్కొంది. ఇది హెల్త్ ఎమర్జెన్సీ కాదని కేంద్రం వివరించిన మరుసటి రోజే ఈ ప్రకటన వెలువడటం గమనార్హం.

Tags: notified, disaster, home ministry, coronavirus

Advertisement

Next Story

Most Viewed