కరోనాపై పోరుకు ఎన్ సీసీ క్యాడెట్లు

by Shamantha N |
కరోనాపై పోరుకు ఎన్ సీసీ క్యాడెట్లు
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా పై పోరుకు ఎన్ సీసీ క్యాడెట్లను కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దించనుంది. కరోనా కట్టడికి సేవలందిస్తున్న అధికారులకు మద్దతుగా 18 ఏళ్లకు పైబడిన ఎన్ సీసీ క్యాడెట్ల సేవలను వినియోగించుకునేందుకు మోడీ ప్రభుత్వం నిర్ణయించింది. ‘ఎక్సర్సైజ్ ఎన్ సీసీ యోగ్దాన్’ ప్రోగ్రాం కింద తమ క్యాడెట్ల సేవలను పౌర అధికారులకు అందించేందుకు ఎన్ సీసీ సిద్ధమైంది.

కరోనా మహమ్మారిపై పోరాడుతున్న పలు ఏజెన్సీలు, అధికారులకు తాత్కాలికంగా సహకారం అందించడానికి సంబంధించి ఎన్ సీసీ గురువారం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇప్పటికే 25 వేల మంది క్యాడెట్లను సహాయ సహకారాలకు తరలించినట్టు ఆ స్టేట్మెంట్ పేర్కొంది.

ఏ విధులు నిర్వర్తిస్తారు?

హెల్ప లైన్, కాల్ సెంటర్లలోని విధులు.. మెడిసిన్స్ , నిత్యావసర వస్తువులు, ఆహారం, ఇతర వస్తువుల పంపిణీలో ఈ క్యాడెట్లు సేవలందించనున్నారు. ట్రాఫిక్ సేవలు, డేటా మేనేజ్ మెంట్, కమ్యూనిటీకి సహాయ సహకారాలు అందిస్తారు. అయితే, లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తిన చోట్లలో.. యాక్టివ్ మిలిటరీ విధులకు వీరు దూరంగా ఉంటారు. వైరస్ హాట్ స్పాట్ లలోకీ వీరికి ప్రవేశం లేదు.

ఎవరు అర్హులు..?

18 ఏళ్లు.. ఆపై వయసున్న సీనియర్ డివిజన్ వాలంటరీ క్యాడెట్స్ మాత్రమే ఇందుకు అర్హులు. పర్మనెంట్ ఇన్ స్ట్రక్టర్ స్టాఫ్ లేదా అసోసియేట్ ఎన్ సీసీ అధికారి పర్యవేక్షణలో బృందాలుగా వీరిని విధుల్లోకి పంపిస్తారు. ఒక్కో బృందంలో ఎనిమిది నుంచి 20 మంది క్యాడెట్లు ఉంటారు.

విధుల్లోకి ఎలా తీసుకుంటారు?

రాష్ట్ర ప్రభుత్వం లేదా జిల్లా అధికారులు రిక్వైర్మెంట్ ను ఎన్ సీసీ స్టేట్ డైరెక్టరేట్లకు తెలియజేస్తారు. ఆ వివరాలను రాష్ట్ర ప్రభుత్వం లేదా స్థానిక పౌర అధికారులతో ఎన్ సీసీ డైరెక్టరేట్ లేదా గ్రూప్ హెడ్ క్వార్టర్ లేదా యూనిట్ లెవెల్ ఎన్ సీసీ అధికారులు చర్చించి సమన్వయ పరుస్తారు. అవసరానికి తగినట్టుగా క్యాడెట్ల సేవలను వినియోగిస్తారు.

Advertisement

Next Story

Most Viewed