- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తొలిసారిగా ఆన్‌లైన్‌లో పంచాయతీ నిధుల ఆడిటింగ్!
న్యూఢిల్లీ: గ్రామ పంచాయతీ నిధులను తొలిసారిగా ఆన్‌లైన్‌లో ఆడిటింగ్ చేయడానికి కేంద్రం నిర్ణయించింది. దేశంలోని సుమారు 2.5లక్షల గ్రామ పంచాయతీల్లో 20 శాతం మేరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆన్‌లైన్ ఆడిట్ చేయాలని కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ నిర్ణయ తీసుకుంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2020-21) పూర్తిస్థాయిలో అన్ని గ్రామ పంచాయతీ నిధులను తనిఖీ చేయాలని భావిస్తున్నట్టు ఈ శాఖ రాష్ట్రాలకు తెలియజేసింది. అంటే ఈ ఏడాది సుమారు 50వేల గ్రామ పంచాయతీ నిధులను ఆన్‌లైన్‌లో ఆడిట్ చేయనున్నారు. ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లను ఈ పంచాయతీలు ఏ విధంగా ఉపయోగించాయి? అనే విషయంపై ఫోకస్ పెట్టి 2019-20 ఆర్థిక సంవత్సర చిట్టాలను, బుక్స్‌ను తనిఖీ నిర్వహించనున్నారు. క్షేత్రస్థాయిలో నిధులకు జవాబుదారీ ఉండటానికి ఈ ఆడిట్ నిర్వహిస్తున్నది. ఈ తనిఖీలను కేంద్రం స్వయంగా అభివృద్ధి చేసిన ‘ఆడిట్ఆన్‌లైన్’ అనే అప్లికేషన్ ద్వారా నిర్వహించనుంది. ఇందులో ఫిజికల్‌గా వెరిఫై చేసే ఆప్షన్ ఉన్నది. ఈ ఆన్‌లైన్ ఆడిట్‌ను జిల్లా-రాష్ట్ర-కేంద్ర స్థాయిలో పర్యవేక్షించడానికి సౌలభ్యమున్నది. కొందరు వర్కర్లకు జియో ట్యాగింగ్ ఉండటంతో వార నేరుగా సైట్‌కు వెళ్లి శాంపిల్ చెక్ చేసే అవకాశమున్నది.