నగరంలో కేంద్ర బృందం పర్యటన

by Shyam |
నగరంలో కేంద్ర బృందం పర్యటన
X

దిశ, న్యూస్ బ్యూరో: జలశక్తి విభాగం అదనపు కార్యదర్శి అరుణ్ భరోక నేతృత్వంలోని అంతర్ మంత్రిత్వశాఖ కేంద్ర బృందం మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లోని విక్టోరియా ప్లే గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన తాత్కాలిక షెల్టర్ హోంను సందర్శించింది. వివిధ రాష్టాలకు చెందిన 102 మంది వలస కార్మికులకు ఇక్కడ కల్పించిన వసతుల గురించి బృంద సభ్యులు స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

అనంతరం కింగ్ కోఠి ఆస్పత్రిని కేంద్ర బృందం తనిఖీ చేసింది. ఆస్పత్రిలోని సౌకర్యాలను పరిశీలించింది. అక్కడ పనిచేస్తున్న డాక్టర్లు, నర్సులను కలిసి మాట్లాడింది. పీపీఈ కిట్లు, ఎన్-95 మాస్కులు తదితర రక్షణ పరికరాల లభ్యత గురించి ఆరా తీసింది. కొవిడ్-19 నివారణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై నగరంలో గత నాలుగు రోజులుగా కేంద్ర బృందం అధ్యయనం చేస్తోంది. గాంధీ ఆస్పత్రి, బేగంపేటలోని నేచర్ క్యూర్ ఆస్పత్రులతో పాటు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో చేపడుతున్న చర్యలు, కార్యక్రమాలను పరిశీలించిన ఈ బృందం సభ్యులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ
అధికారులు పేర్కొన్నారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సైతం కేంద్ర బృందం తెలంగాణలోని లాక్‌డౌన్ అమలు, పేదల కోసం తీసుకుంటున్న చర్యల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తుచేశారు.

Tags: GHMC, Central Team, Kingkoti, Victoria ground, Shelter

Advertisement

Next Story

Most Viewed