- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనాపై కేంద్రం సూచనలు..
ఏ వార్త చూసినా.. ఏ ఛానల్ పెట్టినా అన్ని కరోనా వార్తలు తప్ప మరే ఇతర వార్తలూ సరిగా కనిపించడం లేదు. దీంతో ప్రజలు భయాందోళనలు గురయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో ప్రజలు ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం, మానసికవేత్తలు కలిసి కొన్ని కీలక సూచనలు చేశారు. అవేంటో తెలుసుకుందాం. కరోనా వైరస్ గురించి నిజాలు చెబితే పర్వాలేదు కానీ.. సోషల్ మీడియాలో కొందరు లేనిపోని రూమర్లు క్రియేట్ చేస్తూ ప్రజల్లో భయాలు కలిగిస్తున్నారు. ఏది నిజమో, ఏది అబద్ధమో డాక్టర్లు, కేంద్రం, రాష్ట్రాలూ, మీడియా చెబుతున్నా.. చాలా అంశాల్లో ప్రజలకు భయాలు అలాగే ఉంటున్నాయి. ఈ పరిస్థితుల్లో కరోనా టెన్షన్ అనేది ప్రజల్లో పెరుగుతోంది. కరోనా వస్తుందేమో, సోకుతుందేమో, ఇప్పుడెలా అనే భయాన్ని ప్రజల్లో కలిగిస్తున్నారు కొందరు. అందుకే ప్రజలు భయబ్రాంతులకు గురి కాకుండా మానసికంగా ఫిట్‌గా ఉండేందుకు కేంద్రం కొన్ని సూచనలు చేసింది.
ఈ లక్షణాలు ఉంటే… మీలో కరోనా టెన్షన్ ఉన్నట్టే అని మానసిక వేత్తలు సూచిస్తున్నారు.
– నిద్ర సరిగా పట్టకపోవడం, దేనిపైనా కాన్సన్ట్రేషన్ (ఏకాగ్రత) లేకపోవడం.
– మీ ఆరోగ్యం, మీ వాళ్ల ఆరోగ్యంపై ఏదో తెలియని ఆందోళన ఉండటం.
– వేర్వేరు సమయాల్లో నిద్ర వస్తుండటం, ఏం తింటున్నామో దానిపై శ్రద్ధ లేకపోవడం.
– ఇప్పటికే ఉన్న అనారోగ్యాలు మరింత బాధిస్తుండటం.
– పొగ తాగే అలవాటు, మందు, మత్తు పదార్థాల వాడకం మరింత పెరగడం.
పై సమస్యలు ఉన్నంత మాత్రాన కరోనా ఉన్నట్టు కాదు. టెన్షన్ ఉన్నవారిలో అలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. మరి టెన్షన్ పోగొట్టుకోవడానికి ఏం చెయ్యాలి?
– కరోనా ఇలా చేస్తే పోతుంది, అలా చేస్తే పోతుంది అనే రూమర్లను నమ్మకండి. కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి వచ్చే వార్తల్ని మాత్రమే నమ్మండి. వాళ్ల సూచనలనే పాటించండి.
– అదే పనిగా కరోనా వైరస్ న్యూస్ చూడకుండా.. కాసేపు బ్రేక్ తీసుకోండి. ఏదైనా పుస్తకం చదవండి. కామెడీ సీన్ల వంటివి చూడండి. సోషల్ మీడియాకు కాసేపు దూరం అవ్వండి.
– యోగా ప్రాక్టీస్ చేయండి. బాగా గాలి పీల్చి వదలండి. ఒత్తిడి, టెన్షన్ల వంటి వాటిని యోగా తగ్గిస్తుందని చాలా పరిశోధనలు తేల్చాయి.
– మంచి ఆరోగ్యకరమైన, వేడిగా ఉండేవి తినండి. ఎక్కువ నీరు తాగుతూ, ఎక్సర్‌సైజ్ చేయండి. పాటలు వినండి. కలర్‌ఫుల్ డ్రాయింగ్ వెయ్యండి.
– మీకు బాగా దగ్గరైన వారితో ఆప్యాయంగా మాట్లాడండి. మీ మనసులో భావాల్ని వ్యక్తం చెయ్యండి. వాళ్లలో భయాలుంటే వాటిని పోగొట్టండి.
– ఒత్తిడి టెన్షన్ల వంటివి మరింత ఎక్కువవుతుంటే డాక్టర్‌ని కలవటం మంచిది. అన్ని జాగ్రత్తలూ తీసుకుంటే చైనా లాగ కరోనా నుంచి బయటపడొచ్చు.
Tags: Central govt, Instructions, Coronavirus, Social Media Rumors, Central Health Department