డబ్బులు పోగొట్టుకున్నారా..? వెంటనే ఈ నెంబర్‌కు కాల్ చేయండి..

by Anukaran |
cyber-attack
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో చాలా మంది సైబర్ నేరగాళ్ల చేతిలో ఏదోరకంగా మోసపోతూనే ఉన్నారు. కొందరు డబ్బులు పొగొట్టుకుంటే, మరికొందరు తమ పర్సనల్ డేటాతో పాటు సర్వస్వాన్ని కోల్పోయి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. కొందరైతే ఏకంగా ఆత్మహత్యలకు పాల్పాడుతున్నారు. ఇటీవల సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంటంతో వారికి భరోసా కల్పించేందుకు కేంద్ర హోంశాఖ కొత్త హెల్ప్ లైన్ నెంబర్ తీసుకొచ్చింది.

155260 నెంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేసిన వెంటనే సైబర్ క్రైం అధికారులు సత్వరమే చర్యలు చేపడుతారని పేర్కొన్నారు. బాధితులు ఈ నెంబర్‌కు కాల్ చేయగానే సైబర్ నేరగాళ్ల అకౌంట్‌ను హోల్డ్‌లో పెట్టి.. డబ్బులు విత్ డ్రా చేయకుండా అడ్డుకోవచ్చునని తెలిపారు. అంతేకాకుండా పోగొట్టుకున్న మొత్తాన్ని వెనక్కి తీసుకొచ్చేలా చేయవచ్చునన్నారు. ఆన్‌లైన్ నగదు లావీదేవీలు ఎక్కువగా చేసేవారు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నట్టతే మారు ఆలోచించకుండా వెంటనే కాల్ చేస్తే ప్రయోజనం ఉంటుందని కేంద్ర హోంశాఖ ప్రకటించింది.

Advertisement

Next Story