ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం ఊరట..

by Shamantha N |
ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం ఊరట..
X

దిశ, వెబ్ డెస్క్ :
లాక్‌డౌన్‌ సమయంలో విధులకు హాజరుకాని ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. కొవిడ్ కారణంగా ఉద్యోగులు తమ సర్వీసుకు సంబంధించి ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్రం భారీ ఉపశమనం కల్పించింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణా వ్యవహారాల మంత్రిత్వశాఖకు చెందిన డీవోపీటీ కార్యాలయం తాజాగా మెమో జారీచేసింది.

ప్రభుత్వ ఉద్యోగులు అధికారిక పర్యటనలో ఉన్న సమయంలో కేంద్రం లాక్‌డౌన్‌ ప్రకటించింది. ఈ సమయంలో ఎక్కడి వారక్కడే ఉండిపోయారు. దీంతో సర్వీసు రూల్స్ సమస్యలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో కేంద్రం క్లారిటీనిచ్చింది. రవాణా సౌకర్యాలు లేక తిరిగి హెడ్‌క్వార్టర్స్‌లో విధులకు హాజరు కాలేకపోయినప్పటికీ, ఉన్నతాధికారులకు ఏ రూపంలోనైనా సమాచారమిచ్చి ఉంటే.. వారు తిరిగి విధుల్లో చేరినట్లుగా భావిస్తున్నట్లు స్పష్టంచేసింది.దీంతో లాక్ డౌన్ కారణంగా ఉద్యోగాలకు దూరమైన వారికి కొంత ఉపశమనం దొరికింది. కేంద్రం తీసుకున్ననిర్ణయం పట్ల ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story