లాక్‌డౌన్ మార్గదర్శకాలు ఇవే..

by vinod kumar |
లాక్‌డౌన్ మార్గదర్శకాలు ఇవే..
X

ఢిల్లీ: దేశవ్యాప్తంగా మే 3 వరకు లాక్‌డౌన్ పొడిగించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. విమాన, రైలు, బస్సు, మెట్రో సర్వీసులను రద్దు చేసింది. అయితే ఈ నెల 20 నుంచి కొన్ని రంగాలకు మినహాయింపునిస్తున్నట్లు ప్రకటించింది.

కేంద్రం విడుదల చేసిన ప్రధాన మార్గదర్శకాలు

– మే 3 వరకు రాష్ట్రాల మధ్య రవాణా సేవలు బంద్.
– ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పనిసరిగా ధరించాలి.
– దేశవ్యాప్తంగా వ్యవసాయం, అనుబంధ రంగాలకు అనుమతి.
– గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమల నిర్వహణకు అనుమతి.
– హాట్‌స్పాట్ జోన్లలో జనసంచారం ఉండకూడదు.
– కాఫీ, తేయాకు పరిశ్రమల్లో 50శాతం మ్యాన్ పవర్‌కు అనుమతి.
– పట్టణాల్లోని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు అనుమతి.
– హాట్ స్పాట్‌లను ప్రకటించే అధికారం రాష్ట్రాలదే
– ఆన్ లైన్ షాపింగ్, ఈ కామర్స్‌కు అనుమతి
– మత ప్రార్థనలు, దైవ కార్యక్రమాలపై నిషేధం
కాగా, కేంద్ర ప్రకటించిన లాక్ డౌన్ నిబంధనలు ఈ నెల 20 నుంచి అమల్లోకి రానున్నాయి.

Tags: lockdown, guidelines, central government, corona

Advertisement

Next Story

Most Viewed