- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాయిల్డ్ రైస్ కొనే ప్రసక్తే లేదు.. కేసీఆర్ ధర్నాపై కేంద్రం రియాక్షన్
దిశ, వెబ్‌డెస్క్: ధాన్యం కోనుగోలుపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ ఇందిరా పార్కు వద్ద గురువారం ధర్నా చేపట్టిన సంగతి తెలిసిందే. కేసీఆర్ ధర్నాపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. గత ఖరీఫ్‌లో 32 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కొన్నామని.. ఈ ఖరీఫ్‌లో 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కొనుగోలు అంశం పరిశీలనలో ఉందని తెలిపింది. గత రబీ సీజన్‌లో ఇచ్చిన హామీతో మొత్తం వరి ధాన్యం కొనుగోలు చేస్తామని స్పష్టం చేసింది. రబీలో ఎంత కొనుగోలు చేస్తామనేదానిపై త్వరలోనే క్లారిటీ ఇస్తామంది కేంద్ర ప్రభుత్వం.
బాయిల్డ్ రైస్ కొనలేం..
ఇదే సమయంలో బాయిల్డ్ రైస్‌ను కొనే ప్రసక్తే లేదని కుండ బద్దలు కొట్టింది. బాయిల్డ్ రైస్ తినే రాష్ట్రాలు సొంతంగా సేకరణ చేస్తున్నాయని గుర్తు చేస్తూ.. జాతీయ ప్రయోజనాల రీత్యా పంట వైవిధ్యం అవసరమని పేర్కొంది. దేశంలో వరి సాగు ఎక్కువైందని.. ధాన్యం నిల్వలు పెరిగిపోతున్నాయని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో పప్పు ధాన్యాల కొరత పెరిగిపోవడం, అన్ని రాష్ట్రాల్లో వరి పంట సాగు పెరడగం, ధాన్యం దిగుబడులు కూడా పెరిగాయని కేంద్రం వెల్లడించింది.