- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేంద్రం కీలక నిర్ణయం.. నైట్ కర్ఫ్యూ విధించాలంటూ లెటర్..!
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా గడగడలాడిస్తోన్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు భారత్‌లో రోజు రోజుకూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కొత్త వేరియంట్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. అయితే, విదేశాల నుంచి వచ్చిన వారిలో మాత్రమే ఒమిక్రాన్ కేసులు గుర్తించారు. ఈ క్రమంలో ఇతరులకు సంక్రమించకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం అప్రమత్తం చేసింది. కరోనా నిబంధనలను పటిష్టంగా అమలు చేయాలని అలర్ట్ చేస్తూ.. అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ లేఖ రాశారు. దేశంలో10 రాష్ట్రాల్లోని 27 జిల్లాల్లో గత రెండు వారాలుగా పాజిటివిటీ రేటు పెరుగుతోందని, కేసుల కట్టడికి చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఏ జిల్లాలోనైనా కేసులు, పాజిటివిటీ రేటు పెరిగినట్లైతే కంటైన్మెంట్ జోన్లుగా పరిగణించి.. అవసరమైతే నైట్ కర్ఫ్యూ విధించాలని పేర్కొన్నారు.