సీబీఎస్‌ఈ పరీక్షలపై రేపు రానున్న క్లారిటీ..

by Shamantha N |
సీబీఎస్‌ఈ పరీక్షలపై రేపు రానున్న క్లారిటీ..
X

దిశ, తెలంగాణ బ్యూరో : సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షల నిర్వహణపై నెలకొన్న సందిగ్ధతను నేటి ( డిసెంబర్ 31)న తొలగించనున్నట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ బుధవారం తెలిపారు. సీబీఎస్‌ఈ విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులను నిర్వహిస్తున్నారు. పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారా లేక సాధారణ పద్ధతిలో నిర్వహిస్తారా అన్నది తేలాల్సి ఉంది. బోర్డు పరీక్షలకు సంబంధించిన వివరాలను గురువారం సాయంత్రం 6 గంటలకు వెల్లడిస్తామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. మన దేశంలో సుమారు 21, 271 పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్‌లో 16 లక్షల వరకూ విద్యార్థులు చదువుతున్నారు.

లాక్‌డౌన్ కారణంగా తగ్గిపోయిన సమయాన్ని భర్తీ చేయడానికి అకాడమిక్ క్యాలెండర్‌‌తో పాటు సిలబస్‌ను 30 శాతం తగ్గించారు. సిలబస్ తగ్గింపుపై నిరసనలు రావడంతో ప్యాటర్న్ మార్చి తిరిగి కొనసాగించారు. ఆగస్టు నెల తర్వాత సీబీఎస్ఈ విద్యార్థులకు ఆన్‌లైన్ ద్వారా క్లాసులను బోధిస్తున్నారు. సాధారణ అకాడమిక్ ఇయర్‌లో మార్చి -ఏప్రిల్‌లో పరీక్షలు నిర్వహిస్తారు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ వస్తున్న నేపథ్యంలో పరీక్షలను ఈ విధానంలో నిర్వహించాలన్నది తేలాల్సి ఉంది. ఆన్‌లైన్ విధానంలోనే పరీక్షలు నిర్వహించేందుకు ఇప్పటికే విద్యార్థులకు సమాచారమిచ్చారు. అయితే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. బోర్డు పరీక్షల నిర్వహణ విషయంలో విద్యార్ధులు, తల్లిదండ్రులు, అధ్యాపకుల నుంచి వచ్చిన సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.

T

Advertisement

Next Story