పుదుచ్చేరిలో ప్రెసిడెంట్ రూల్.. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ నో!

by Shamantha N |   ( Updated:2021-02-24 08:15:20.0  )
cm-narayana-swami-gave-his-resignation to tamili sye
X

దిశ, వెబ్‌డెస్క్ : కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో సీఎం నారాయణ స్వామి ఆధ్వర్యంలోని కాంగ్రెస్-డీఎంకే కూటమి ప్రభుత్వం మెజార్టీని కోల్పోయిన విషయం తెలిసిందే. ఈనెల 22వ తేదీన లెఫ్ట్‌నెంట్ గవర్నర్ నిర్వహించిన ఫ్లోర్ టెస్టులో కాంగ్రెస్ ఓటమి పాలయ్యాక సీఎం నారాయణ స్వామి తన రాజీనామా పత్రాన్ని తమిళి సై సౌందర్ రాజన్‌కు అందజేశారు.

తదుపరి ప్రక్రియలో భాగంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తమిళి సై ఆహ్వానించగా ప్రతిపక్ష పార్టీ బీజేపీ ముందుకు రాలేదు. దీంతో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కోరుతూ తమిళి సై కేంద్రానికి సిఫారుసు చేసింది. దీనిని కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదించినట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవడేకర్ తెలిపారు. రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ సమ్మతి అనంతరం పుదుచ్చేరిలో రాష్ట్ర ప్రభుత్వ పాలన రద్దు చేయబడుతుందని ఆయన వెల్లడించారు.

Advertisement

Next Story