- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సమాచారం ఇచ్చేందుకు కేంద్రం నిరాకరణ
దిశ, ఏపీ బ్యూరో: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఆర్టీఐ ద్వారా సమాచారం ఇచ్చేందుకు కేంద్ర ఆర్ధిక శాఖ నిరాకరించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయమై ఆర్టీఐ కింద అడిగిన సమాచారాన్ని డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్ మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ నిరాకరించింది. ఆర్టీఐ కార్యకర్త ఇనుగంటి రవికుమార్ అడిగిన సమాచారాన్ని ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. విశాఖ ఉక్కులో పెట్టుబడుల ఉపసంహరణ అంశం ఆర్ధిక రహస్యాల పరిధిలోకి వస్తుందని పేర్కొంది. ఈ అంశంపై సీఎం జగన్ , ప్రతిపక్షనేత చంద్రబాబు రాసిన లేఖలపై సమాధానం ఇవ్వాలంటూ ప్రధాని కార్యాలయం ఆదేశించినా డిఐపీఏఎం పట్టించుకోలేదు. విశాఖ స్టీల్ ప్లాంటులో పెట్టుబడుల ఉప సంహరణ సమాచారం సెక్షన్ 8 (1) (ఏ) కింద గోప్యంగా ఉంచాలని డీఐపీఏఎం పేర్కొంది.
ఇదిలా ఉంటే నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయించింది. అందులో భాగంగా నష్టాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలని కేంద్ర కేబినెట్ తీర్మానించింది. అయితే కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలుగు రాష్ట్రాల్లో ఉద్యమం మెుదలైంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇప్పటికీ ఉద్యమం జరుగుతూనే ఉంది. మరోవైపు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. అలాగే సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సైతం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే