వివేక్ మృతిపై ప్రముఖుల సంతాపం…

by Jakkula Samataha |   ( Updated:2021-04-17 00:56:08.0  )
వివేక్ మృతిపై ప్రముఖుల సంతాపం…
X

దిశ, వెబ్ డెస్క్: తమిళ స్టార్ కమెడియన్ వివేక్ ఈ రోజు ఉదయం 4.35నిమిషాలకు గుండె సంబంధిత వ్యాధితో మృతి చెందిన విషయం తెలిసిందే. వివేక్ మృతి పట్ల పలువురు ప్రముఖులు తమ సంతాపాన్ని ప్రకటించారు. తన ఆప్తమిత్రుడు వివేక్ మరణం తనను ఎంతో కలిచివేసిందని, ఆయనతో గడిపిన క్షణాలు నేను ఎన్నటికీ మర్చిపోలేనని సూపర్ స్టార్ రజినీకాంత్ అన్నారు. అంతే కాకుండా ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ “వివేక్.. నువ్వు మమల్ని విడిచి వెళ్ళాలవంటే నమ్మబుద్దికావడం లేదు.. మీరు మమ్మల్ని ఎంతో ఎంటర్ టైన్ చేశారు. మిమ్మల్ని ఎన్నటికీ మరచిపోలేము” అని స్పందించారు. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ స్పందిస్తూ ” ప్రియమైన మిత్రమా.. మొక్కలతో పాటు మాలోను ఆలోచనలు నాటినందుకు కృతజ్ఞతలు. మాలో చైతన్యాన్ని నింపినందుకు ధన్యవాదులు.. మిస్ యు” అంటూ వారు సంతాపాన్ని ప్రకటించారు. వీరితో పాటు మరికొందరు వివేక్ మృతిపై సంతాపం ప్రకటిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed