- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమితాబ్ జీ.. త్వరగా కోలుకోవాలి
– ప్రముఖులు, అభిమానులు
ముంబైలో కరోనా ఎంతగా విజృంభిస్తోందో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ కూడా కరోనా బారిన పడ్డారు. శనివారం రాత్రి స్వయంగా అమితాబ్.. ఈ విషయాన్ని వెల్లడించారు. అటు అభిషేక్ బచ్చన్‌కు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో కుటుంబ సభ్యులతో పాటు బచ్చన్ ఇంటి సిబ్బంది కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. యాంటిజెన్ పరీక్షల్లో జయ, ఐశ్వర్యలకు నెగెటివ్ రాగా.. పూర్తిస్థాయి పరీక్ష ఫలితాల కోసం వేచి చూడాలి. అమితాబ్ ఆరోగ్యంగా నిలకడగా ఉందని, ప్రస్తుతానికి ఆయన ఐసోలేషన్ విభాగంలో ఉన్నట్లు నానావతి హాస్పిటల్ వైద్యులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో.. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు ప్రముఖులు అమితాబ్ త్వరలో కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. ఇక బిగ్ బీ.. సోషల్ మీడియా వేదికగా తన భావాలను ఓ వీడియో ద్వారా పంచుకున్నారు.
కరోనా తీవ్ర రూపం దాలుస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. ప్రాణాలకు తెగించి వైద్యమందిస్తున్న నానావతి హాస్పిటల్ సిబ్బందికి బిగ్ బీ కృతజ్ఞతలు తెలిపారు. ‘ఎవరూ భయపడవద్దు.. కరోనా బారి నుంచి మేము త్వరగా బయటపడతాం. ఎంతో ప్రేమ.. సేవాభావం, బాధ్యతతో చికిత్స అందిస్తున్న వైద్యులు, నర్సులకు, నానావతి ఆస్పత్రి సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఇదే తరహాలో మీరు పనిచేసుకుంటూ పోవాలని ఆశిస్తున్నాను’ అంటూ వీడియో ద్వారా తెలిపారు అమితాబ్.
కొవిడ్ బారినపడ్డ బాలీవుడ్ బాద్‌షా అమితాబ్ బచ్చన్ (77) త్వరలో కోలుకోవాలని మెగాస్టార్ చిరంజీవి ఆకాక్షించారు. అమితాబ్ జీ త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని చిరు ట్విటర్‌లో పేర్కొన్నారు.
‘మీరు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను సర్’ – ధనుష్
‘అమిత్ జీ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’ – బోనీ కపూర్
‘మీరు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. లక్షల మంది ప్రార్థనల ఆశీర్వాదం మీతో ఉంది’
– అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి
మహేశ్ బాబు, రవితేజ, రాశీఖన్నా, తాప్సీ, ప్రియమణి, నిత్యామీనన్‌తో పాటు పలువురు ప్రముఖులు అమితాబ్ బచ్చన్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని పేర్కొన్నారు. అమితాబ్ బచ్చన్ త్వరలోనే కోలుకుని తిరిగి ఆరోగ్యవంతంగా కనపడతారని ఆకాంక్షిస్తున్నట్లు బాలీవుడ్ నటులు మాధురీ దీక్షిత్, సోనమ్ కపూర్, షాహిద్ కపూర్, రితీష్ దేశ్‌ముఖ్‌తో పాటు పలువురు ట్వీట్లు చేశారు. తమ అభిమాన నటులు కొవిడ్ నుంచి క్షేమంగా బయటపడాలని దేశవ్యాప్తంగా వారి అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు.