- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జాగ్రత్తలు పాటించకపోతే.. మళ్లీ లాక్‌డౌన్
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ మొదలైన విషయం తెలిసిందే. దీనిపై సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) డైరెక్టర్ రాకేశ్ మిశ్రా కీలక విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన గురువారం ఓ మీడియాతో మాట్లాడుతూ.. మానవ తప్పిదంవల్లే సెకండ్ వేవ్ ప్రమాదం పొంచిఉందని తెలిపారు. సెకండ్ వేవ్‌కు కారణం, వైరస్‌లో మార్పులు కాదు అని వెల్లడించారు. తక్కువ జాగ్రత్తలు పాటించడమే వేవ్‌కి ప్రధాన కారణం అవుతుందని అన్నారు. సెకండ్ వేవ్ వస్తే చాలా కష్టం అని, ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో సెకండ్ వేవ్ కొనసాగుతోందని తెలిపారు.
వైరస్ మనచట్టూనే ఉందని, ఈ విషయం ఎవరూ మర్చిపోవద్దని రాకేశ్ మిశ్రా హెచ్చరించారు. కొన్నిసార్లు సెకండ్ వేవ్‌లు తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని సూచించారు. పండుగలు, పెళ్లిళ్లలో జాగ్రత్తలు పాటించకపోతే మరోసారి లాక్‌డౌన్ తప్పదని అభిప్రాయపడ్డారు. వ్యాక్సిన్ వచ్చేవరకూ వేవ్‌లు వస్తూనే ఉంటాయని స్పష్టం చేశారు. అంతేగాకుండా దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ అందాలంటే మరో ఏడాది, రెండేళ్లు పడుతుందని వెల్లడించారు. మాస్కులు, శానిటైజర్లు, భౌతికదూరంతోనే కరోనాను జయించాలని సూచించారు.